Advertisementt

అల్లుడు అదుర్స్ కమర్షియల్ ప్లాన్.. ఆ ముచ్చట కూడా..

Sat 08th Aug 2020 08:59 PM
alludu adhurs,kethika sharma,bellamkonda sai srinivas,telugu  అల్లుడు అదుర్స్ కమర్షియల్ ప్లాన్.. ఆ ముచ్చట కూడా..
Alludu Adhurs commercial plan.. అల్లుడు అదుర్స్ కమర్షియల్ ప్లాన్.. ఆ ముచ్చట కూడా..
Advertisement
Ads by CJ

వరుస అపజయాలు ఎదుర్కొంటున్న బెల్లంకొండ శాయి శ్రీనివాస్ కి రాక్షసుడు ద్వారా మంచి హిట్ లభించింది. తమిళ చిత్రం రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేసి తన కెరీర్లో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే హిట్ ఇచ్చిన కిక్కులో కమర్షియల్ సినిమాకి ప్లాన్ వేసాడు. కందిరీగ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు.

అల్లుడు శీను సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు చాలా ఉన్నాయట. కందిరీగ సినిమాలో లాగే ఈ సినిమాలోనూ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉండనున్నాయట. తనదైన కామెడీతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నాడట. పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మరో కమర్షియల్ యాంగిల్ ని కూడా యాడ్ చేసారని సమాచారం.

అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ స్పెషల్ సాంగ్ లో రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ బెల్లంకొండతో స్టెప్పులు వేయనుందట. పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ఇంకా విడుదల కాలేదు. ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా అవకాశం రావడం కేతిక అదృష్టమనే చెప్పాలి. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 

Alludu Adhurs commercial plan..:

Alludu Adhurs commercial plan..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ