Advertisementt

గుడ్ న్యూస్.. అభిషేక్ కూడా జయించాడు..

Sat 08th Aug 2020 09:24 PM
abhishek bachchan,amitab bachchan,aishwarya rai,bollywood  గుడ్ న్యూస్.. అభిషేక్ కూడా జయించాడు..
Good news.. Abhishek Tested negative గుడ్ న్యూస్.. అభిషేక్ కూడా జయించాడు..
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని రోజు రోజుకీ పెంచుకుంటూ వెళ్తుంది. నిజమైన సోషలిస్టుగా వ్యవహరిస్తూ వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేస్తూ దాని పంజా విస్తరించుకుంటూ పోతుంది. చాలా మంది సినిమా తారలు కూడా కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఫ్యామిలీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఇంకా ఐశ్వర్య- అభిషేక్ ల కూతురు ఆరాధ్యకి కూడా కరోనా సోకింది.

అయితే ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కరోనా నుండి త్వరగానే కోలుకున్నారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ సైతం కరోనాని జయించారు. అభిషేక్ ఒక్కడే కరోనాపై ఎక్కువ రోజులు పోరాడుతూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అభిషేక్ కరోనాని జయించాడట. ఈ విషయమై అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకి తెలియజేసాడు. కరోనాని జయించిన అమితాబ్ ఇంటికి వస్తున్నాడని తెలిపాడు. మొత్తానికి అమితాబ్ ఫ్యామిలీ కరోనాని జయించడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Good news.. Abhishek Tested negative:

Good news..  Abhishek discharged..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ