Advertisementt

టక్ జగదీష్ లో నాని పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Sun 09th Aug 2020 09:17 AM
nani,tuck jagadish,ritu varma,shiva nirvana  టక్ జగదీష్ లో నాని పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Interesting update from Nanis Tuck Jagadish టక్ జగదీష్ లో నాని పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్ను కోరి, మజిలీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాలో నాని పాత్రపై అప్డేట్ బయటకి వచ్చింది.

నాని కెరీర్లో ఇంతవరకు కనిపించని పాత్రలో టక్ జగదీష్ లో కొత్తగా కనిపిస్తాడట. మన సినిమాల్లో హీరోలు ఏదో ఒక డిజార్డర్ తో బాధపడటం చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక కొత్తరకమైన డిజార్డర్ తో బాధపడే పాత్రలో నాని కనిపిస్తాడట. బైపోలార్ డిజార్డర్ అనే వింత జబ్బు నానికి ఉంటుందట. దీని ప్రకారం సంతోషం వస్తే ఎక్కువ ఎక్సయిట్ మెంట్ కి లోనవుతారట. అలాగే బాధొచ్చినపుడు డిప్రెషన్ కి గురవుతారట.

అంటే సంతోషమొచ్చినా, బాధొచ్చినా ఆపుకోలేని రకం అన్నమాట. భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు పాత్రలో కనిపించి హిట్టు అందుకున్న నాని బైపోలార్ డిజార్డర్ తో బాధపడే వ్యక్తిగా ఏ విధంగా చేస్తాడో చూడాలి. అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకున్న థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Interesting update from Nanis Tuck Jagadish:

Interesting update from Nanis Tuck Jagadish

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ