Advertisementt

త్రివిక్రమ్ కథలు వింటున్నాడట.. ఎవరికోసమంటే?

Mon 10th Aug 2020 10:02 PM
trivikram srinivas,heard stories,sithara entertainments,haarika and hassine creations  త్రివిక్రమ్ కథలు వింటున్నాడట.. ఎవరికోసమంటే?
Trivikram Srinivas Heard stories for These Banners త్రివిక్రమ్ కథలు వింటున్నాడట.. ఎవరికోసమంటే?
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ దర్శకుడి కంటే ముందు మాటల మాంత్రికుడు, కథా రచయిత. మాటల రచయిత. త్రివిక్రమ్ మాటల మాయాజాలానికి స్టార్ హీరోలకున్న అభిమానులున్నారు. అయన ఏ హీరోతో సినిమా తీసినా ఆయన సినిమాలకై ఓ వర్గం ప్రేక్షకులు ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తుంటారు. అయితే మాటల రచయితగా పని చేసిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారి నిన్నమొన్నటి అల వైకుంఠపురములో సినిమా వరకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగాడు. మధ్యలో అజ్ఞాతవాసి త్రివిక్రమ్ క్రేజ్ తగ్గించినా ఆ అట్టర్ ప్లాప్ మూవీ పవన్ ఖాతలోనే ఎక్కువగా పడింది. అయితే ఎప్పడూ తన సినిమాలకు తానే కథలను సమకూర్చుకునే త్రివిక్రమ్‌కి కాపీ డైరెక్టర్ అని పేరున్నప్పటికీ.. ఆయన దగ్గర ఉన్న కంటెంట్‌తో, మేకింగ్ స్కిల్స్‌తో ఆ విషయాన్నీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు.

కథ, మాటల విషయంలో అంత దమ్మున్న దర్శకుడు ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ లో కథలు వినే ప్రోగ్రాం పెట్టుకున్నాడట. తన సర్కిల్స్‌లో బాగా తెలిసిన నిర్మాతలను పిలిచి కథలు వింటున్నాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ కథలు వింటున్నది, హారికా అండ్ హాసిని నిర్మాణ సంస్థ కోసం, అలాగే సితార ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నారు. ఆ నిర్మాణ సంస్థలు త్రివిక్రమ్‌కి ఓన్ బ్యానర్స్ లాంటివి. అందుకే త్రివిక్రమ్ కొత్త కథలు వింటున్నాడని అంటుంటే.. కాదు త్రివిక్రమ్ కొత్త సినిమాల కోసం ఆయన ఈ కథలు వింటున్నాడని.. ఎప్పుడూ కామెడీ కామెడీ అనడమెందుకు.. తన జోనర్ నుండి బయటికొచ్చి కొత్తతరహా సినిమాల వైపు త్రివిక్రమ్ మొగ్గు చూపుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. 

Trivikram Srinivas Heard stories for These Banners:

Trivikram Srinivas Heard stories for sithara entertainments and haarika and hassine creations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ