తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీమేక్ ల హవా నడుస్తుంది. తెలుగు నుండి ఇతర భాషల్లో రీమేక్ కోసం ఏ రేంజిలో సినిమాలు వెళ్తున్నాయో, అలాగే ఇతర భాషల నుండి తెలుగులోకి ఆ రేంజిలోనే వస్తున్నాయి. ఇప్పటికే చాలా రీమేక్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అలా చర్చల దశలో ఉన్న సినిమాల్లో ఆర్టికల్ 15 కూడా ఒకటి. బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలందుకున్న్న ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవనుందట.
గత కొన్ని రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. రీమేక్ లపై అమితాసక్తి గల హీరో వెంకటేష్ ఆర్టికల్ 15 తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడని, సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఆర్టికల్ 15 మరో హీరో చేతికి వెళ్ళిందట. క్షణం, గూఢాచారి, ఎవరు వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న అడవి శేష్ ఆర్టికల్ 15 రీమేక్ లో హీరోగా చేస్తున్నాడట.
ఇన్విజిబుల్ గెస్ట్ సినిమాని ఎవరు గా తీర్చిదిద్ది మంచి విజయం అందుకున్న అడవి శేష్, ఆర్టికల్ 15 రీమేక్ తో వస్తున్నాడని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి ఈ రీమేక్ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్న అడవి శేష్, ఆర్టికల్ సినిమాని ఒప్పుకుంటాడో లేదో చూడాలి.