Advertisementt

ఉమామహేశ్వరుడిపై రామ్ చరణ్ ప్రశంసలు..

Mon 10th Aug 2020 08:54 PM
ram charan,umur,satyadev,venkatesh maha,arka media works  ఉమామహేశ్వరుడిపై రామ్ చరణ్ ప్రశంసలు..
Ram Charan Praises UMUR team.. ఉమామహేశ్వరుడిపై రామ్ చరణ్ ప్రశంసలు..
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకూ చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వాటన్నింటిలోకి సరైన హిట్ అందుకున్న సినిమా అంటే సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే చెప్పాలి. థియేటర్లో సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీసు లెక్కల ద్వారా సినిమా హిట్టా ఫట్టా అని తేలిపోతుంది. మరి ఓటీటీలో అయితే ఎలా..?

దీనికి సరైన పరిష్కారం సోషల్ మీడియా.. ఓటీటీలో వచ్చిన సినిమా విజయం అందుకుందా లేదా తెలియాలంటే సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి ఎంత చర్చ జరిగింది అన్నది తెలియాలి. ఆ విధంగా చూసుకుంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పాలి. జులై 30వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గురించి ప్రతీరోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. 

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టాడు. పూర్తి కంటెంట్ బేస్డ్ గా తెరకెక్కిన ఈ చిత్రం తనని బాగా ఆకట్టుకుందని, ముఖ్యంగా హీరో సత్యదేవ్,  నరేష్ సుహాస్ మొదలగు వారి నటన బాగుందని ప్రశంసించాడు. ఇంకా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వెంకటేష్ మహా బ్రిలియన్స్ ని పొగిడాడు. మొత్తానికి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం అందరినీ ఆకట్టుకుంటూ అందులో నటించినవారికి మంచి పేరు తెచ్చి పెడుతుంది.

Ram Charan Praises UMUR team..:

Ram Charan Praises UMUR team..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ