కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్‌కి నో అంటున్న స్టార్ హీరోలందరూ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్‌కి జాన్తా నై అంటున్నారు. అయితే ముంబై హైకోర్టు కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడంతో 65 ఏళ్ళకు పైబడిన నటీనటులను, టెక్నీకల్ సిబ్బందికి షూటింగ్స్ కి అనుమతులు లేవని ఆర్డర్ వేసింది. అయితే ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ హీరోలు కరోనాని లెక్క చెయ్యడం లేదు. కరోనా ఉంటే ఏమైంది.. అంటూ షూటింగ్స్ కోసం విదేశాలకు వెళుతున్నారు. అయితే ఇప్పుడొక స్టార్ హీరో కరోనా తగ్గడం, వ్యాక్సిన్ రావడం అంతా నాకు సంబంధం లేదు.. నేను మాత్రం మరో ఆరు నెలలు షూటింగ్‌కి రానని దర్శకనిర్మాతలకు తెగేసి చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి.
సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇప్పుడు షూటింగ్స్ కోసం మరో 6 నెలలు నేను సిద్ధంగా లేనని చెబుతున్నాడు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం అన్నాత్తె షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో షూటింగ్ పునఃప్రారంభించి నెల రోజుల్లో పని పూర్తి చేయాలని... పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తమిళనాట కరోనా ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో రజినీకాంత్ కుటుంబ సభ్యులు ఆయనని మరో ఆరు నెలల పాటు షూటింగ్ కి పంపేది లేదని.. ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ఇలాంటి టైం లో అయన షూటింగ్ కి హాజరవడం మంచిది కాదని.. కాబట్టి మరో ఆరు నెలల పాటు రజినీకాంత్ షూటింగ్‌కు రారని చెబుతున్నారు. ఇప్పటికే అన్నాత్తె దర్శకనిర్మాతలకు ఈ విషయమై కబురు కూడా పంపారట.