ఎన్టీఆర్ కరోనా లాక్‌డౌన్‌లో కంటికి కనిపించడం లేదు. కారణం షూటింగ్స్ కాదు.. కరోనా. అందుకే ఇంటికి పరిమితమైన ఎన్టీఆర్ RRR షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అని ఎదురు చూడడం లేదు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వ్యాక్సిన్ రాగానే షూటింగ్ కోసం బయలు దేరతాడు ఎన్టీఆర్. RRRతో పాటుగా త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా ఎన్టీఆర్ పూర్తి చెయ్యడానికి బాగా ప్రిపేర్ అవుతున్నాడు. త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అవ్వగానే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నట్లుగా టాక్ ఉంది.
అయితే ప్రశాంత్ నీల్ కథ చెప్పకుండానే ఎన్టీఆర్ అతనితో సినిమాకి కమిట్ అయినట్లుగా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు లాక్‌డౌన్ టైం లో ప్రశాంత్ నీల్ ఫోన్ లో చెప్పిన కథ విన్నాడని.. కానీ పూర్తి కథ చెప్పాడా.. లేదంటే జస్ట్ రఫ్ గా కథ చెప్పాడా అనేది తెలియదు కానీ.. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ ఎన్టీఆర్ విన్నాడని మాత్రం చెబుతున్నారు. పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 200 కోట్ల బడ్జెట్లో ఈ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తారని చెబుతున్నారు. మరి లాక్‌డౌన్‌లో ఎన్టీఆర్ ఖాళీగా కూర్చున్నాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు అనుకుంటే.. ఇలా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా లైన్ లో పెట్టుకుంటున్న విషయం తెలియడంలేదు ఫ్యాన్స్ కి. ఇక ప్రశాంత్ నీల్ చెప్పిన కథలో ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కూడా చెప్పినట్టుగా సోషల్ మీడియా టాక్.