Advertisementt

నానీకి ఆ హీరోయిన్ నో చెప్పిందా..?

Thu 13th Aug 2020 06:41 PM
keerthi suresh,nani,vivek atreya,heroine keerthi suresh,nenu local  నానీకి ఆ హీరోయిన్ నో చెప్పిందా..?
Heroine says No To Natural Star Nani Movie నానీకి ఆ హీరోయిన్ నో చెప్పిందా..?
Advertisement
Ads by CJ

కీర్తి సురేష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నానితో ‘నేను లోకల్’ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి హిట్ కూడా. కానీ ఇప్పుడు కీర్తి సురేష్, నాని సినిమాకి నో చెప్పినట్టుగా ఫిలింనగర్ టాక్. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ వరుస ప్లాప్స్‌తో బాధపడి.. తర్వాత బాగా బరువు తగ్గించి పర్ఫెక్ట్‌గా రంగంలోకి దిగింది. మహానటి ముందు సరైన పాత్రలు ఎంచుకోకపోవడం వలనే కీర్తి సురేష్‌కి మహానటి తర్వాత విడుదలైన సినిమాలు ప్లాప్ అయ్యాయి. తర్వాత కీర్తి సురేష్ ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటుంది. తాజాగా మహేష్ బాబుతో ఏకంగా ‘సర్కారు వారి పాట’లో అవకాశం పట్టేసింది.

అలాగే నితిన్ ‘రంగ్ దే’, ‘మిస్ ఇండియా’తో పాటుగా తమిళ సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నానితో కలిసి నటించేందుకు నో చెప్పింది అనే టాక్ నడుస్తుంది. నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం వివేక్ ఆత్రేయ కథతో కీర్తిని సంప్రదించాడని.. అయితే కీర్తి కథ విన్నాక నాని సినిమాకి నో చెప్పిందని అంటున్నారు. పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్న కీర్తికి వివేక్ ఆత్రేయ ఎలాంటి కథ చెప్పాడో.. కీర్తి పాత్రకి ఇంపార్టెన్స్ లేకపోవడం వలనే కీర్తి ఈ సినిమాకి నో చెప్పి ఉండొచ్చు అనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది. 

Heroine says No To Natural Star Nani Movie:

Keerthi Suresh Says No To Nani and Vivek Atreya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ