Advertisementt

‘ఆచార్య’.. చరణ్ సీన్స్‌ కేకగా ఉంటాయట!

Thu 13th Aug 2020 08:50 PM
ram charan role,highlight,koratala siva,acharya movie,chiranjeevi  ‘ఆచార్య’.. చరణ్ సీన్స్‌ కేకగా ఉంటాయట!
Chiranjeevi, Ram Charan Scenes In Acharya! ‘ఆచార్య’.. చరణ్ సీన్స్‌ కేకగా ఉంటాయట!
Advertisement
Ads by CJ

ఆచార్య సినిమాని కొరటాల శివ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ లేకపోతే ఆచార్య షూటింగ్ పరుగులు పెట్టడము, చిరు పుట్టిన రోజుకి ఆచార్య టీజర్ విడుదల కావడము జరిగేది. కానీ కరోనా మాత్రం తగ్గడం లేదు. ఏదో రష్యా వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు. ఇక సెలబ్రిటీస్ అంతా వ్యాక్సిన్ వేసుకుని షూటింగ్స్ కోసం బయలుదేరుతారేమో చూడాలి. అయితే ఆచార్య సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ గెస్ట్ రోల్.. అందులోనూ ఓ 30 నిమిషాల పాత్ర చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే రామ్ చరణ్ పాత్రపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా... సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఆచార్యలో ఎలా కనిపిస్తాడో.. ఎలాంటి సీన్స్ రామ్ చరణ్ పై కొరటాల షూట్ చేస్తాడో అనే సస్పెన్స్ లో ఉన్నారు.

అయితే తాజాగా చరణ్ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పరిచయం అయ్యి, గూజ్‌బంప్స్ ఇస్తారట. చిరు మరియు చరణ్‌ల మధ్య ఒక అదిరిపోయే సాంగ్ సహా ఓ బ్లాస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ చనిపోతుందని.. అక్కడి నుంచి సినిమా రేంజ్ కూడా మారిపోతుందని తెలుస్తుంది. చరణ్ క్యారెక్టర్ ఎండ్ అయిన తర్వాత చిరంజీవి వెళ్లే దారి సినిమా రేంజ్ పెంచేస్తుందని వార్తలొస్తున్నాయి. మరి ఈవార్తలో ఆచార్య సినిమాపై మరింత క్రేజు అంచనాలు పెరిగిపోయాయి. రామ్ చరణ్ చనిపోవడమే సినిమాలో కీలకం అని.. చరణ్ చనిపోయే కేరెక్టర్ చేస్తున్నాడు అంటే కొరటాల రాసిన కథలో ఎంత దమ్ముండాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి కరోనా తగ్గగానే ఆచార్య షూటింగ్ మొదలు పెడతారని అంటున్నారు.

Chiranjeevi, Ram Charan Scenes In Acharya!:

Ram Charan Role Highlight in Koratala Acharya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ