Advertisementt

డైరెక్షన్ ప్లానింగ్ లో జెంటిల్ మేన్ బ్యూటీ..

Thu 13th Aug 2020 09:24 PM
nivetha thomas,nani,v the movie,indraganti mohanakrishna  డైరెక్షన్ ప్లానింగ్ లో జెంటిల్ మేన్ బ్యూటీ..
Gentle man beauty Interested in direction.. డైరెక్షన్ ప్లానింగ్ లో జెంటిల్ మేన్ బ్యూటీ..
Advertisement
Ads by CJ

నాని జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైన భామ నివేథా థామస్, మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ తో జై లవ కుశ, నానితో నిన్ను కోరి వంటి హిట్లు రావడంతో ఆమెకి అవకాశాలు బాగా వస్తున్నాయి. అయితే నటనా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటున్న నివేథా, ప్రస్తుతం నాని హీరోగా చేసిన వి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన వి చిత్రం ఎన్నో మల్లగుల్లాల  తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అయితే ఇటీవల నివేథా థామస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. హీరోయిన్ గా కెరీర్ చక్కగా నిర్మించుకుంటున్న తరుణంలో నివేథా డైరెక్షన్ పై మనసు పారేసుకుందట. లాక్ డౌన్ సమయాన్ని అందుకు బాగా వినియోగించుకుందట.

హీరోయిన్ గా నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ఈ భామ కలం చేత పట్టి రచయితగా మారిందట. ఇప్పటికే కొన్ని కథలు కూడా రెడీ చేసిందట. వాటిని మరికొద్ది రోజుల్లో తెరమీదకి తీసుకువచ్చే దర్శకత్వ బాధ్యతలని తీసుకోనుందట. డైరెక్షన్ పై ఆసక్తి కనబరుసున్న నివేథా, పెళ్ళిపై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నందున ఇప్పట్లో పెళ్ళి ఆలోచన చేయట్లేదని అంటుంది.

Gentle man beauty Interested in direction..:

Gentle man beauty Interested in direction..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ