Advertisementt

ఫ్యాన్స్ కోసం ‘వకీల్‌సాబ్’ ముస్తాబవుతున్నాడు

Sat 15th Aug 2020 02:43 PM
pawan kalyan,vakeel saab,teaser,birthday,fans  ఫ్యాన్స్ కోసం ‘వకీల్‌సాబ్’ ముస్తాబవుతున్నాడు
Vakeel Saab Latest Update ఫ్యాన్స్ కోసం ‘వకీల్‌సాబ్’ ముస్తాబవుతున్నాడు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్ చెయ్యడం మంచిది కాదని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దానితో వకీల్ సాబ్ ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. జస్ట్ 20 రోజుల షూటింగ్ కంప్లీట్ అయితే వకీల్ సాబ్ కంప్లీట్ అయ్యేది. వేణు శ్రీరామ్ ఫ్రీ అయ్యేవాడు. కానీ పవన్ కళ్యాణ్ కరోనా వ్యాక్సిన్ రానివ్వండి తరవాతే షూటింగ్ అనడంతో వకీల్ సాబ్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే తాజాగా వకీల్ సాబ్ తెర వెనుక పనులు జరుగుతున్నట్లుగా సమాచారం.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కి ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలని వేణు శ్రీరామ్ చూస్తున్నాడు. అందుకే వకీల్ సాబ్ టీజర్ కి ప్లాన్ చేసి పవన్ బర్త్‌డే కానుకగా విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ప్రవీణ్ పూడి ఆధ్వర్యంలో మొదలైనట్లుగా తెలుస్తుంది. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ టీజర్ కోసం డబ్బింగ్ కూడా ఇస్తాడని.. దానితో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి వకీల్ సాబ్ టీజర్ తో ఉర్రుతలూగించాలని చూస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రియాక్టుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజుకి బ్రేక్ చెయ్యాలనే కసితో ఉన్నారు. ఇక దానికి టీజర్ కూడా తోడైతే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. 

Vakeel Saab Latest Update:

Vakeel Saab Teaser for PawanKalyan Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ