Advertisementt

శర్వా సరసన అదితి.. మహాసముద్రంలో తోడుగా..!

Fri 14th Aug 2020 05:58 PM
aditi rao hydari,mahasamudram,sharwanand,ajay bhupathi,siddharth  శర్వా సరసన అదితి.. మహాసముద్రంలో తోడుగా..!
Aditi plays female lead in Mahasamudram..? శర్వా సరసన అదితి.. మహాసముద్రంలో తోడుగా..!
Advertisement
Ads by CJ

సమ్మోహనం సినిమాతో తెలుగు తెరపై మొదటిసారి కనిపించిన అదితీ రావ్ హైదరీ తన మనోహర సౌందర్యంతో ప్రేక్షకులని సమ్మోహన పర్చింది. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా కనిపించాడు. సమ్మోహనం తర్వాత అదితీ రావ్ హైదరీ అంతరిక్షం సినిమాలో కనిపించినప్పటికీ ఆ సినిమా అంతగా పేరు తీసుకురాలేదు.  ప్రస్తుతం  మళ్ళీ ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 

మరికొద్ది రోజుల్లో అమెజాన్ వేదికగా వి చిత్రాన్ని చూడొచ్చని వార్తలు వస్తున్నాయి. అంటే అతి త్వరలో తెలుగు సినిమాలో అదితి పర్ ఫార్మెన్స్ మరోసారి చూడబోతున్నాం అన్నమాట. ఇదిలా ఉంటే తాజాగా అదితీ మరో తెలుగు చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైందని అంటున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం లో అదితీ రావ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ప్రచారం జరుగుతోంది.

హీరోగా శర్వానంద్ చేస్తుండగా, శర్వా సరసన అదితి కనిపించనుందట. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ కి జోడీగా హీరోయిన్ కూడా ఉంటుందట. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు.

Aditi plays female lead in Mahasamudram..?:

Aditi plays female lead in Mahasamudram..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ