ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు త్వరగా కోలుకోవాలి
ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో స్థైర్యం ఉన్నవారు. ఆయన ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉంది. చెన్నైలో లైఫ్ సపోర్ట్ తో ఉన్నారు అని నిన్నటి రోజున తెలియగానే ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకొంటారని భావించాను. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఊరటనిచ్చే వార్త ఇది. మా కుటుంబానికి శ్రీ బాలు గారు ఎంతో సన్నిహితులు. వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
పవన్ కల్యాణ్
అధ్యక్షులు, జనసేన