మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ నాలుగవ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త గెటప్ లో కనిపించాడు. అయితే త్వరలో స్టార్ట్ అవబోతున్న ఈ రియాలిటీ షో గురించి బిగ్ బాస్ మూడవ సీజన్ కంటెస్టెంట్ పునర్నవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తెలుగు బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ అందుకున్న బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా రావడానికి సెలెబ్రిటీలు ఆసక్తి చూపిస్తుంటారు.
బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకుంటే సినిమాల్లో అవకాశాలు వస్తాయని కొందరు, ఇంకా భవిష్యత్తులో బిగ్ బాస్ పాపులారిటీ ఉపయోగపడుతుందని మరికొందరు వస్తుంటారు. అయితే ఒక్కసారి షో పూర్తయ్యాక ఇవన్నీ జరుగుతాయా అంటే అనుమానమే. ఎందుకంటే మొదటి సీజన్ నుండి చూసుకుంటే బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ వచ్చిన వారెవ్వరూ పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించలేదు.
పునర్నవి కూడా అలానే అనుకుందేమో. అందుకే బిగ్ బాస్ లోకి మళ్ళీ వెళ్లకూడదని డిసైడ్ అయ్యిందట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ ద్వారా తనకి ఎలాంటి ఉపయోగం కలగలేదట. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం నేర్చుకున్నావని అడిగితే మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళకూడదని నేర్చుకుందట. మొత్తానికి బిగ్ బాస్ మొదలవుతున్న వేళ ఇలాంటి కామెంట్స్ కొంత ఆశ్చర్యకమే..