Advertisementt

హిందీ ఖైదీ భార్యగా స్టార్ హీరోయిన్...!

Sun 16th Aug 2020 09:34 AM
katrina kaif,khaidi,ajay devgan,karthi,lokesh kanagaraj  హిందీ ఖైదీ భార్యగా స్టార్ హీరోయిన్...!
Star heroine in Hindi khaidi..! హిందీ ఖైదీ భార్యగా స్టార్ హీరోయిన్...!
Advertisement
Ads by CJ

తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే. ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. తాజాగా కార్తీ నటించిన ఖైదీ చిత్రం తెలుగులో మంచి విజయం అందుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వసూళ్ళు కురిపించింది.

హీరోయిన్, పాటలు వంటి కమర్శియల్ హంగులేమీ లేకుండా కేవలం కంటెంట్ తో నడిచే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించారు. చాలా రోజుల తర్వాత కార్తీకి ఖైదీ ద్వారా మంచి విజయం దక్కింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ వెళ్లనుంది. దక్షిణాది సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్న బాలీవుడ్, ఖైదీ చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కుంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది.

కరోనా లేకపోయుంటే ఈ పాటికి చిత్ర షూటింగ్ పూర్తయ్యుండేది. కానీ కరోనా అడ్డంకి రావడంతో షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగణ్ భార్యగా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించనుందట. నిజానికి ఖైదీ చిత్రంలో భార్య పాత్ర లేదు. కానీ బాలీవుడ్ నిర్మాతలు ఈ రీమేక్ కి కమర్షియల్ హంగులని జోడించాలని చూస్తున్నారట. 

అందుకే భార్యగా కత్రినా కైఫ్ నటింపజేయాలని భావిస్తున్నారట. భార్య పాత్ర ఉందంటే పాటలు కూడా ఉండవచ్చు. మొత్తానికి బాలీవుడ్ ప్రేక్షకులకి తగినట్లుగా ఖైదీ చిత్రంలో చాలా మార్పులు కనిపించబోతున్నాయని తెలుస్తుంది.

Star heroine in Hindi khaidi..!:

Star heroine in Hindi khaidi..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ