Advertisementt

ఈ బర్త్‌డేకి ఏం మిస్సవుతుందో చెప్పిన నిధి!

Tue 18th Aug 2020 12:28 AM
nidhhi agerwal,nidhi agarwal,birthday,cake cutting,sets  ఈ బర్త్‌డేకి ఏం మిస్సవుతుందో చెప్పిన నిధి!
Nidhhi Agerwal celebrating her birthday on August 17th ఈ బర్త్‌డేకి ఏం మిస్సవుతుందో చెప్పిన నిధి!
Advertisement
Ads by CJ

షూటింగ్ లొకేషన్‌లో యూనిట్ మధ్య బర్త్‌డే కేక్ కటింగ్ మిస్ అవుతున్నా: నిధి అగర్వాల్

ఆగష్టు 17న హ్యాపెనింగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టినరోజు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈ ఏడాది తన పుట్టినరోజును(ఆగష్టు17) బెంగళూరులో తన నివాసంలోనే కుటుంబ సభ్యులు మధ్య జరుపుకుంటున్నారు. సినీ కెర్రిర్ స్టార్ట్ చేసాక తన పుట్టినరోజు సెట్స్ లోనే జరిగేదని, యూనిట్ సభ్యులు మధ్య కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ జరిగేవని, ప్రస్తుతం కరోనా కారణంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది ఇంట్లో కుటుంబంతోనే పుట్టినరోజు జరుపుకుంటున్నట్లుగా నిధి తెలిపారు. 

ప్రస్తుతం నిధి, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ లాంఛింగ్ మూవీలో నటిస్తున్నారు, అలానే తమిళ్‌లో భూమి అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటున్నారు. ఇక తాజాగా ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డు సెట్ చేశారు నిధి. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్స్‌లో అత్యధికంగా 8.5 మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌తో నిధి మొదటి స్థానంలో ఉన్నారు.

Nidhhi Agerwal celebrating her birthday on August 17th:

 I miss cutting the birthday cake on sets in the presence of cast and crew: Nidhhi Agerwal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ