Advertisementt

హిట్ 2: సెకండ్ హీరో ఎవరు?

Tue 18th Aug 2020 12:44 AM
hit,hit 2,hit sequel,vishwak sen,adivi sesh,nani,second hero  హిట్ 2: సెకండ్ హీరో ఎవరు?
Nani and Vishwak Sen Hit 2 Movie Latest Update హిట్ 2: సెకండ్ హీరో ఎవరు?
Advertisement
Ads by CJ

నాని ప్రొడ్యూసర్‌గా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా మంచి హిట్ అవడమే కాదు.. ప్రొడ్యూసర్‌గా నాని చాలానే వెనకేసుకున్నాడు. అందుకే నాని వెంటనే హిట్‌కి సీక్వెల్‌గా హిట్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు దీనికి సంబందించిన హిట్ 2 స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయింది. అయితే హిట్ 2లో విశ్వక్ సేన్ నటించడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ చాలా డిమాండ్ చేసాడని, కాదు వేరే సినిమాలతో విశ్వక్ సేన్ బిజీ కాబట్టి హిట్ 2 చేయడేమో అంటూ ప్రచారం జరగడం, మధ్యలో విశ్వక్ వలన హిట్ 2 లేట్ అవ్వోచ్చేమో అనుకున్నారు. కానీ. అయితే విశ్వక్ సేన్ హిట్ 2 చేస్తున్నాడని.. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా టాక్.

 

దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చింది. అయితే హిట్ 2లో విశ్వక్ సేన్‌తో పాటుగా మరో హీరో కూడా నటించబోతున్నాడని.. అయితే ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌ అంటున్నారు. నానికి అత్యంత స‌న్నిహితంగా ఉండే ఓ యంగ్ హీరో ఈసినిమాలో న‌టిస్తాడ‌ని అంటుంటే.. అడవి శేష్ రెండో హీరోగా ఈ సినిమాలో నటిస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. కానీ నాని అండ్ కో మాత్రం సెకండ్ హీరో ఎవరనేది చెప్పము.. సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు సెకండ్ హీరోపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తామని అంటున్నారట.

Nani and Vishwak Sen Hit 2 Movie Latest Update:

One More Hero added to Hit Movie sequel 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ