బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ సాహో తో ఉత్తరాదిన తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. దక్షిణాదిన అంతగా ఆకట్టుకోని సాహో చిత్రం ఉత్తరాది వారిని బాగా ఆకట్టుకుంది. అందుకే అక్కడ వసూళ్ళు కురిపించి లాభాల బాట పట్టింది. అయితే బాలీవుడ్ జనాలకి అంతగా చేరువైన ప్రభాస్ తో సినిమా చేయాలని బాలీవుడ్ దర్శకులు ఎప్పటి నుండో అనుకుంటున్నారు.
గతంలో ఈ విషయమై అనేక వార్తలు వచ్చాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ ని హీరోగా పెట్టి సినిమా తీద్దామని చూస్తున్న బాలీవుడ్ జనాలకి ఆ అవకాశం ఈ సారి దొరికినట్టుంది. ప్రస్తుతం రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ చేస్తున్న ప్రభాస్, తన తర్వాతి చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒప్పుకున్నాడు. అనంతరం ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో సినిమా చేస్తున్నాడని వినిపించింది.
అయితే అది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభాస్, ఓం రౌత్ ల వీడియో వైరల్ గా మారింది. వీరిద్దరూ మాట్లాడుకుంటూ రేపటికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే, ప్రభాస్ దానికి ఫుల్ ఎక్సయిట్ మెంట్ తో ఉన్నానని బదులిచ్చాడు. ఆ ఎక్సయిట్ మెంట్ నెక్స్ట్ సినిమా ప్రకటనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి రేపు ఉదయం 7గంటలకి వచ్చే సర్పైజ్ ఏంటో..!