Advertisementt

రూటు మార్చుతున్న మోహన్ బాబు..?

Thu 20th Aug 2020 07:54 AM
mohan babu,directon,diamond ratna babu,son of india,tollywood  రూటు మార్చుతున్న మోహన్ బాబు..?
Mohan Babu Direction Plan రూటు మార్చుతున్న మోహన్ బాబు..?
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు మోహన్ బాబు ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. ఎన్నో విలక్షణమైన పాత్రల్లో జీవించారు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేయని పాత్రంటూ లేదు. అయితే ఎప్పుడూ తెరమీద కనిపించే మోహన్ బాబుకి దర్శకత్వంపై మనసు మళ్ళిందట. చాలా రోజులుగా దర్శకత్వం గురించి ఆలోచిస్తున్నాడట. గత కొన్ని రోజుల నుండి దర్శకుడిగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. 

మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది రచయితలతో చర్చలు జరుపుతున్నాడని సమాచారం అందుతోంది. స్టార్ హీరోలని సంప్రదించాడని టాక్.  ఐతే మోహన్ బాబు తెరకెక్కించే చిత్రం ఏ జోనర్ లో ఉంటుందీ, ఏ విషయం మీద సినిమాని తెరకెక్కిస్తున్నారనేది ఇంకా తెలియనప్పటికీ, ఖచ్చితంగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉండనుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి మోహన్ బాబు ఆకాశం నీ హద్దురా సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. తమిళ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అంతే కాదు డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న దేశభక్తిని రగిలించే చిత్రం సన్ ఆఫ్ ఇండియా లో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.

Mohan Babu Direction Plan:

Mohan Babu Direction Plan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ