ఐదు నెలలుగా తన సినిమా ‘వి ద మూవీ’ ని ఓటిటి వారు భారీ ధర వెచ్చించి తీసుకుంటాను అన్నా సరే.. చల్ కుదరదు నా సినిమా థియేటర్స్‌లోనే దిగాలి అంటూ దిల్ రాజు - నాని - ఇంద్రగంటి - సుధీర్ బాబులు కూర్చున్నారు. కానీ ఐదునెలలుగా తెగని బేరం ఎట్టకేలకు వారం రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు నాని ‘వి’ ని చేజిక్కించుకున్నారు. థియేటర్స్ అయితేనేమిటి.. హోమ్ థియేటర్ అయితేనేమిటి అంటూ నాని ‘వి’ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించాడు. కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్.. ఎప్పటికి తెరుచుకుంటాయో క్లారిటీ లేదు.
కానీ తాజాగా సెప్టెంబర్ 1 నుండి థియేటర్స్ తెరుచుకోబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. కేంద్రం కొన్ని కండిషన్స్ మధ్యన థియేటర్స్ తెరవడానికి అనుమతులు ఇవ్వొచ్చని ఊహాగానాల మధ్యన నాని సెప్టెంబర్ 5న ప్రైమ్ లో విడుదలైపోతుంది. అయ్యెయ్యో థియేటర్స్ తెరుచుకుంటాయనుకునే మార్చి నుండి ఆగస్ట్ వరకు వేచి చూసిన నాని అండ్ టీం ఇప్పుడు డిజిటల్ హక్కులు అమ్మేశాక థియేటర్స్ తెరుచుకుంటాయనే న్యూస్ నానిని షేక్ చేస్తుందేమో.. అందుకే సోషల్ మీడియాలో నెటిజెన్స్ అయ్యెయ్యో.. అరరే ఇప్పుడెలా నాని అంటున్నారు. మరి ఓటిటిలో విడుదలైనా మళ్ళీ థియేటర్స్‌లో ‘వి’ సినిమాని దిల్ రాజు ఎలాగైనా విడుదల చేస్తాడు అది తెలిసిన విషయమే. కానీ ఓటిటిలో చూసేసాక మళ్ళీ థియేటర్స్‌కి ఎవరు వెళతారు? అసలే ఇది కరోనా కష్టకాలమాయే..