Advertisementt

కంచరపాలెం దర్శకుడి కొత్త చిత్రం... ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Sun 23rd Aug 2020 09:32 AM
su mathi< venkatesh maha,paruchuri praveena,umur,kancherapalem  కంచరపాలెం దర్శకుడి కొత్త చిత్రం... ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Venkatesh Mahas New movi First Look.. కంచరపాలెం దర్శకుడి కొత్త చిత్రం... ఫస్ట్ లుక్ వచ్చేసింది..
Advertisement
Ads by CJ

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వెంకటేష్ మహా, ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజై పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. తాజాగా వెంకటేష్ మహా తన మూడవ చిత్రాన్ని ప్రకటించాడు. సు మతి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే వెంకటేష్ మహా మరో విలక్షణమైన కథతో వస్తున్నాడని అర్థం అవుతుంది.

కొత్తగా అమెరికా వచ్చిన ముసలావిడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లోకి వెళ్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తుంది. సినిమా చిత్రీకరణ పూర్తిగా అమెరికాలోనే ఉంటుందట. కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి పరుచూరి ప్రవీణ ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రాన్ని తమ పేరెంట్స్ కి అంకితం చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు పోస్టర్ మీద ప్రకటించారు. వెంకటేష్ మహా, పరుచూరి ప్రవీణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూడవ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Venkatesh Mahas New movi First Look..:

Venkatesh Mahas New movi First Look..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ