కరోనా లాక్‌డౌన్‌తో అన్ని షూటింగ్స్ బంద్ అయినట్లుగా రాజమౌళి కూడా RRR ని ఆపేశాడు. కాకపోతే షూటింగ్ ఆగిన కొద్ది రోజులకి రామ్ చరణ్ పుట్టిన రోజు రావడం రామ్ చరణ్ అల్లూరి టీజర్‌తో మెగా ఫ్యాన్స్‌ని రాజమౌళి శాటిస్ ఫై చెయ్యడం తెలిసిన విషయమే. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ కొమరం బీమ్ టీజర్ లుక్ కోసం బాగా ఎదురు చూశారు. కానీ కరోనా వలన ఎన్టీఆర్ లుక్‌ని వదలలేక చేతులెత్తేశారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. ఎన్టీఆర్ లుక్ ఎప్పుడు వస్తుందో అంటూ మళ్లీ ఎదురు చూపులు స్టార్ట్ చేశారు. అయితే తాజాగా కేంద్ర అనుమతులతో అక్కడక్కడా షూటింగ్స్ మొదలైనాయి. దానితో టాలీవుడ్ కూడా మొదలు పెడుతుంది అనుకుంటే ఎవ్వరూ కదలడం లేదు.
అయితే తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి తీపి కబురు చెప్పారు. అదేమంటే RRR షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అప్పటినుండి పది రోజుల కౌంట్‌డౌన్‌లో ఎన్టీఆర్ కొమరం బీమ్ లుక్ వదులుతామని మాటిచ్చాడు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్వామి ఎప్పుడు కరోనా తగ్గుతుంది.. అప్పుడు RRR మొదలవుతుంది. వెంటనే మా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ చూసుకోవచ్చు అంటూ ఆశగా ఎదురు చూడడానికి రెడీ అయ్యారు. మరి RRR షూటింగ్ కోసమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే పూజలు కూడా మొదలు పెట్టారట.