ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో ఈసరికే సెట్స్ మీదకెళ్ళేదే. కానీ కరోనా వలన ఎన్టీఆర్ ప్లాన్స్ అన్ని తల్లకిందులు అయ్యాయి. ఎన్టీఆర్ RRR నుండి ఎప్పుడు బయటపడాలో.. ఎప్పుడు త్రివిక్రమ్ మూవీ చేయాలో అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ కరోనా కన్నా ముందే ఎన్టీఆర్ సినిమా కథని ఎన్టీఆర్‌కి వినిపించి ఓకే చేసుకున్నాడు. అప్పుడే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీకి ‘అయినను పోయిరావాలె హస్తినకు..’ అనే టైటిల్ సోషల్ మీడియా కెక్కింది. ఎందుకంటే హారిక హాసిని వాళ్ళు ఈ అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో అదే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో టైటిల్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అవడమే కాదు... ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగింది.
అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో ఈసారి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే ఉంటుంది అనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో విన్నాం. అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ముందు అనుకున్న కథ మారిందో.. లేదంటే అసలు అదే కథతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సెట్స్ మీదకెళ్తారో తెలియదు కానీ... ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా టైటిల్ అయినను పోయిరావలె హస్తినకు కాదని, మరో కొత్త ఫ్యామిలీ టైటిల్‌తో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో టైటిల్ ఉంటుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ బ్యాగ్డ్రాప్ పొలిటికల్ కాదని.. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ అంటున్నారు. హారిక హాసిని వారు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినా.. అది ఎన్టీఆర్‌కి కాదని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న న్యూస్ సారాంశం. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ టైటిల్ పై ఇప్పుడు కొత్త ఊహాగానాలు తెర లేపడం మాత్రం ఖాయం.