Advertisementt

చిరు బర్త్‌డే వచ్చింది.. వెళ్లింది.. ఆ ప్రకటనేది?

Wed 26th Aug 2020 04:15 PM
chiranjeevi,birthday,new movies,meher ramesh,bobby,acharya  చిరు బర్త్‌డే వచ్చింది.. వెళ్లింది.. ఆ ప్రకటనేది?
No New Movie Update from Chiru On His Birthday చిరు బర్త్‌డే వచ్చింది.. వెళ్లింది.. ఆ ప్రకటనేది?
Advertisement
Ads by CJ

చిరంజీవి పుట్టినరోజు వచ్చింది వెళ్ళింది. కరోనా కరోనా అంటూ మెగా ఫ్యాన్స్‌ని ఉసూరుమనిపించకుండా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్ బాగా ఖుషి అయ్యారు. ధర్మస్థలిలో మెగాస్టార్ ఆచార్య యాక్షన్ బ్యాక్ లుక్ తోనే ఇరగదీశాడు. కొరటాల శివ, చిరు పుట్టిన రోజు కోసం స్పెషల్ గా వర్క్ చేసి మంచి లుక్ వదలడానికి కరోనా అడ్డంకిగా మారింది. చిరు బ్యాక్ లుక్ తోనే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మెగాస్టార్ చిరు ఆచార్యతో మెగా ఫ్యాన్స్‌ని ఫుల్‌గా శాటిస్ఫై చేశాడు. కానీ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు.

చిరంజీవి దర్శకుడు బాబీతోనూ, అలాగే మెహెర్ రమేష్‌తో వేదాళం రీమేక్ ఫైనల్ చేసాడని, ముందు బాబీ సినిమానే ప్రకటించాలనుకున్నప్పటికీ... మెహెర్ రమేష్ వేదాళం రీమేక్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో ముందు మెహెర్ రమేష్ వేదాళం రీమేక్‌నే చిరు ప్రకటిస్తాడని, అది కూడా చిరు పుట్టిన రోజునే చిరు - మెహెర్ రమేష్ కాంబో మూవీ ప్రకటన ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఊహించారు. సోషల్ మీడియాలో చిరు కొత్త సినిమా ప్రకటనపైన రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చాయి. కానీ చిరు పుట్టిన రోజు వచ్చింది వెళ్ళింది కానీ చిరు కొత్త సినిమా ప్రకటన రాలేదు. మరి చిరు సాహో దర్శకుడు సుజిత్ తో లూసిఫెర్ రీమేక్ చేస్తా అని హ్యాండ్ ఇచ్చినట్టుగా వీళ్లకు ఇవ్వడు కదా అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

No New Movie Update from Chiru On His Birthday:

Mega Star Chiranjeevi Fans Waiting for His new Projects

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ