Advertisementt

సత్యదేవ్ మంచి అవకాశం పట్టేసాడు..?

Tue 25th Aug 2020 07:48 PM
satyadev,rajanikanth,annatte,telugu  సత్యదేవ్ మంచి అవకాశం పట్టేసాడు..?
Satyadev got good opportunity..? సత్యదేవ్ మంచి అవకాశం పట్టేసాడు..?
Advertisement
Ads by CJ

థియేటర్లు తెరుచుకోని కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీసు లెక్కలు లేవు కాబట్టి సత్యదేవ్ మార్కెట్ ఎంత అనేది తెలియలేదు. కాకపోతే సత్యదేవ్ కి మాత్రం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో  అంతకుముందు చేసిన చిత్రాలకి కూడా ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. 


కన్నడలో సక్సెస్ సాధించిన లవ్ మాక్ టైల్ చిత్రానికి  తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రంలో సత్యదేవ్ హీరోగా చేస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది. గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం మరికిద్ది రోజుల్లో సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇదే కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయట. తాజాగా సత్యదేవ్ కి రజనీ సినిమాలో అవకాశం వచ్చిందని అంటున్నారు.


శంఖం, శౌర్యం చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నాత్తె సినిమాలో తెలుగు నటుడిని తీసుకోవాలని చూస్తున్నారట. అది సత్యదేవ్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు. ఇదే నిజమైతే సత్యదేవ్ కి  మంచి అవకాశం దొరికినట్టే.

Satyadev got good opportunity..?:

Satyadev got good opportunity

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ