కరోనా కారణంతో రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం RRR సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం లుక్ ఇవ్వనందుకు గాను రాజమౌళి RRR షూటింగ్ మళ్ళీ మొదలు కాగానే ఖచ్చితంగా పది రోజుల్లో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ వదులుతామని ఎన్టీఆర్ ఫాన్స్ కి హామీ ఇచ్చాడు. అయితే ఈలోపు RRR నుండి రామ్ చరణ్ అల్లూరి పాత్రకి జోడిగా సీత కేరెక్టర్ లో నటిస్తున్న అలియా భట్ RRR నుండి తప్పుకుని RRR టీం కి క్షమాపణ కూడా చెప్పింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం తన మీదున్న ట్రోలింగ్ కి అలియా భట్ ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్‌లో నెపోటిజంపై సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. స్టార్ వారసులను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. అందులో భాగంగా అలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్‌ని డిస్ లైక్స్ తో హోరెత్తించారు. ఇక అలియా నటించబోయే సినిమాల మీద సుశాంత్ అభిమానుల ఆగ్రహం పడుతుంది అని చాలామంది అనుకుంటున్నారు.
దానిలో భాగంగానే అలియా భట్ రాజమౌళి RRRకి సారి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుండగా.. అలియా భట్ ప్లేస్ ని రామ్ చరణ్‌తో గతంలో బాలీవుడ్‌లో జంజీర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంక చోప్రా నటిస్తుంది అనే న్యూస్ కూడా హైలెట్ అయ్యింది. అయితే RRR నుండి అలియా భట్ తప్పుకుంది అనేది ఎంత పెద్ద గాసిప్పో.. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ఆమె పాత్ర చెయ్యబోతుంది అనేది అంతే గాసిప్ అంటున్నారు. గాసిప్ అయినా.. అలియా RRR నుండి తప్పుకుని అనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యింది.