Advertisementt

ఇన్‌సైడ్ టాక్: ‘వి’ మూవీ సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ కానుందా?

Thu 27th Aug 2020 11:35 PM
sudheer babu,v movie,highlight,mohan krishna indraganti,v  ఇన్‌సైడ్ టాక్: ‘వి’ మూవీ సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ కానుందా?
Positive wibes on Sudheer Babu role in V Movie ఇన్‌సైడ్ టాక్: ‘వి’ మూవీ సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ కానుందా?
Advertisement
Ads by CJ

యంగ్ హీరోలు నాని, సుధీర్ బాబు కలిసి నటించిన మూవీ ‘వి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. అదితిరావు హైదరి, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. కరోనా వల్ల ఇంకా థియేటర్లు తెరుచుకోలేని పరిస్ధితి ఉంది కాబట్టి.. ‘వి’ చిత్రాన్ని డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా.. హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు.

టీజర్ విడుదలైనప్పుడు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే అని అనుకున్నారంతా. కానీ ఇందులో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా 6 ప్యాక్ బాడీతో హీరో సుధీర్ బాబు చేస్తున్న ఓ ఫైట్ సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభం నుండీ అతను ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ‘సమ్మోహనం’ చిత్రంలో నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో మరో మెట్టు పైకి ఎక్కిన సుధీర్ బాబు.. ‘వి’ చిత్రంతో మంచి యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ సుధీర్ బాబు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని.. ట్రైలర్ తర్వాత టాక్ నడుస్తుండటం విశేషం.

Positive wibes on Sudheer Babu role in V Movie:

Sudheer Babu Role Highlight in V Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ