Advertisementt

తమిళ జెర్సీలో హీరోయిన్ గా అవకాశం ఆమెకే..

Thu 27th Aug 2020 09:49 PM
trisha,jersey tamil remake,vishnu vishal,nani,gowtham tinnanuri  తమిళ జెర్సీలో హీరోయిన్ గా అవకాశం ఆమెకే..
Jerser Remake in Tamil.. heroine fix.. తమిళ జెర్సీలో హీరోయిన్ గా అవకాశం ఆమెకే..
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో జెర్సీ కూడా ఒకటి. ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించిన నాని అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగులో స్పోర్ట్ బేస్డ్ డ్రామా సినిమాలు చాలా వచ్చాయి. కానీ వాటన్నింటిలోకి జెర్సీ చాలా డిఫరెంట్. క్రికెట్ తప్ప మరో పని తెలియని ఓ యువకుడు సడెన్ గా క్రికెట్ ఆపేయాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతాడు, ఆ తర్వాత తనకి ఓ కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ ఎందుకు పట్టాడన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు.

శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. తెలుగులో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం హిందీలో రీమేక్ కి వెళ్ళింది. షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. తెలుగు జెర్సీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే తాజాగా ఈ సినిమా తమిళంలోకి వెళ్లనుంది. 

తమిళంలో విష్ణు విశాల్ హీరోగా కనిపించనున్నాడట. హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఒక పిల్లాడికి తల్లిగా చేయడానికి త్రిష్ ఒప్పుకుందని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత కీలకమో హీరోయిన్ పాత్ర కూడా అంతే కీలకం. మరి అలాంటి పాత్రలో త్రిష ఇరగదీస్తుందనే చెప్పాలి. 

Jerser Remake in Tamil.. heroine fix..:

Jerser Remake in Tamil.. heroine fix..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ