ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చిన బంధుప్రీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంధుప్రీతి వల్లే ఎలాంటి సినిమా నేపథ్యం లేని వారికి అవకాశాలు రావట్లేదంటూ, బాలీవుడ్ పెద్దలు కొందరు అవకాశాలు రానీయకుండా చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఈ ఉద్యమం పెద్ద రేంజిలోనే జరుగుతుంది.
దీనివల్ల స్టార్ కిడ్స్ ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నెపోటిజంపై చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో స్టార్ కిడ్స్ సినిమాల విషయంలో విమర్శలు వస్తున్నాయి. స్టార్ కిడ్స్ సినిమాల్లో ఉంటే వాటిని చూడొద్దన్నంత రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఆలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ విషయంలో ఏం జరిగిందో అందరం చూసాం. ప్రపంచ వ్యాప్తంగా ఏ వీడియోకి రానన్ని డిస్ లైక్స్ ఈ ట్రైలర్ కి వచ్చాయి. ఇంకా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా చిత్రానికి కూడా విమర్శల సెగలు తాకాయి.
తాజాగా అనన్య పాండే నటించిన కాలీ పీలీ చిత్రానికీ ఇదే రేంజ్ లో డిస్ లైక్స్ పడ్డాయి. ఐతే ఈ విషయమై పూరి జగన్నాథ్ సినిమా ఫైటర్ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే పై విమర్శలు విపరీతంగా వస్తున్నాయి.
అందువల్ల పూరీ ఫైటర్ చిత్రానికి ఇబ్బందులు వస్తాయని అర్థం అవుతుంది. అదీగాక ఈ చిత్రానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఒకానొక నిర్మాతగా ఉన్నాడు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని చూస్తే పూరీ ఫైటర్ కి నెటిజన్ల నుండి కష్టాలు తప్పవని తెలుస్తుంది.