Advertisementt

ఆ విషయంలో నాని పై ప్రశంసలు పడుతున్నాయి..

Fri 28th Aug 2020 11:10 AM
nani,v the movie,indraganti mohanakrishna,aditi rao hydari,nivetha thomas,sudheer babu  ఆ విషయంలో నాని పై ప్రశంసలు పడుతున్నాయి..
All Praises for Nani.. ఆ విషయంలో నాని పై ప్రశంసలు పడుతున్నాయి..
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన వి చిత్రం సెప్టెంబరు 5వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేసి, ఇక లాభం లేదనుకుని ఓటీటీకి ఇచ్చేసారు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొదటి  స్టార్ హీరో సినిమా ఇదే. అందుకే అందరి అటెన్షన్ వి సినిమాపైనే ఉంది. అమెజాన్ ప్రైమ్ కూడా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.

సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా, నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడట.  ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ చూస్తుంటే సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అనిపిస్తున్నాడు. చెప్పడానికి ఇది నాని సినిమానే అయినప్పటికీ సుదీర్ బాబు పాత్ర కూడా మరో హీరో తరహాలోనే ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అదీగాక నాని నెగెటివ్ గా ప్రొజెక్ట్ అవుతూ, అతన్ని పట్టుకోవడానికి సుధీర్ బాబు వేసే ప్రయత్నంలో హీరోయిజం కనిపిస్తుంది.

ఐతే ఒక సినిమాలో వేరే హీరోకి అంత ప్రాధాన్యం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ విషయంలో నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను హీరోగా నటిస్తున్న సినిమాలో మరో హీరోకి కూడా ఎలివేషన్స్ సీన్స్ వంటివి పెట్టడం, అలాంటి వాటికి నాని అంగీకరించడం, మొదలగు విషయాల పట్ల నాని ని పొగుడుతున్నారు.

All Praises for Nani..:

All Praises for Nani..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ