Advertisementt

ఆ టైటిల్ త్రివిక్రమ్ త్యాగం చేశాడా?

Sun 30th Aug 2020 12:18 AM
tollywood,star director,sacrifice,hero satyadev,trivikram srinivas,gurthunda seethakalam  ఆ టైటిల్ త్రివిక్రమ్ త్యాగం చేశాడా?
Tollywood Star Director sacrifice for Hero Satyadev ఆ టైటిల్ త్రివిక్రమ్ త్యాగం చేశాడా?
Advertisement
Ads by CJ

దర్శకుడు త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. అందమైన డైలాగ్స్‌తో ప్రేక్షకుల మదిని దోచే దర్శకుడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ మాటలే కాదు... ఆయన సినిమాలకు పెట్టే టైటిల్స్ కూడా ఆహ్లాదంగా ఆకట్టుకుంటాయి. చాలా డిఫ్రెంట్‌గా, కూల్‌గా అనిపిస్తాయి. ఎక్కువగా అ సెంటిమెంట్ తోనే టైటిల్ పెట్టే త్రివిక్రమ్ చాలా రేర్ గా అ అక్షరాన్ని మారుస్తాడు. అతడు, అ...ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సామెత, అల వైకుంఠపురములో వంటి టైటిల్స్ చాలా బావుంటాయి. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ టైటిల్ కూడా అయినను పోయిరావలె హస్తినకు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా త్రివిక్రమ్ తనదగ్గరున్న ఓ అద్భుతమైన టైటిల్‌ని హీరో సత్యదేవ్‌కి త్యాగం చేసాడట.

సత్యదేవ్ తమన్నా జంటగా క‌న్న‌డ‌లో హిట్ అయిన ల‌వ్ మాక్‌టైల్‌కి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్‌ని ఖరారు చెయ్యడం, అధికారిక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించాడట. తన కొత్త సినిమాలకు ఆ టైటిల్ ఉంటుంది అన్న లెక్కలో త్రివిక్రమ్ ఆ టైటిల్‌ని రిజిస్టర్ చేయించగా.. ఆ టైటిల్ మా సినిమాకి బావుంటుంది అని సత్యదేవ్.. త్రివిక్రమ్ ని రిక్వెస్ట్ చెయ్యడంతో త్రివిక్రమ్ ఆ టైటిల్ ని సత్యదేవ్ కి ఇచ్చేసినట్లుగా టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే అనే పాట స్ఫూర్తిగా ఈ గుర్తుందా శీతాకాలం టైటిల్‌ని రిజిస్టర్ చేయించాడట త్రివిక్రమ్. ఇప్పుడు ఆ టైటిల్‌ని సత్యదేవ్ కి త్యాగం చేసాడట త్రివిక్రమ్.

Tollywood Star Director sacrifice for Hero Satyadev:

Trivikram Srinivas sacrifice Gurthunda seethakalam for Hero Satyadev

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ