Advertisementt

అలియా భట్‌కి దెబ్బ మీద దెబ్బ..!

Mon 31st Aug 2020 10:36 PM
alia bhatt,sadak 2,rrr heroine,sadak 2 result,mahesh bhatt  అలియా భట్‌కి దెబ్బ మీద దెబ్బ..!
Alia Bhatt Sadak 2 Disaster at Box Office అలియా భట్‌కి దెబ్బ మీద దెబ్బ..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హాట్ హీరోయిన్ అలియా భట్‌కి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ కోలుకోలేకుండా చేస్తుంది. నిన్నటివరకు సుశాంత్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న అలియా భట్ నేడు.. సడక్ 2 డిజాస్టర్ తో సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. స్టార్ కిడ్‌గా పుట్టిన అలియా భట్‌ని సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. అలియాని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. చాలా రోజులుగా సోషల్ మీడియా జోలికి రాకుండా ఉన్న అలియా భట్ మళ్లీ, సడక్ 2 తో ఓటిటి ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలియా భట్ తండ్రి మహేష్ భట్ తీసిన సడక్ 2 ట్రైలర్‌కి సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు చుక్కలు చూపెడితే.. సడక్ 2 పై యావత్ సినీ ప్రేమికులు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

అలియా భట్ తండ్రి మహేష్ భట్ తెరకెక్కించిన సడక్ 2 సినిమా వరల్డ్ వైడ్ వరెస్ట్ డిజాస్టర్‌గా ప్రేక్షకులు ఫిక్స్ చేశారు. సినిమా చూసిన వారు నెత్తి నోరు బాదుకుంటున్నారు. సడక్ 2 కన్నా వరెస్ట్ సినిమా చూడలేదంటున్నారు. మరి అలియా భట్‌కి దెబ్బకి మీద దెబ్బ అంటే ఇదే. పుండు మీద కారం జల్లినట్టుగా సుశాంత్ సింగ్ అభిమానులు ఓ పక్క, సడక్ 2 డిజాస్టర్ దెబ్బ మరోపక్క. రెండింటితోనూ అలియా నిద్రలేని రాత్రులు గడుపుతుందట. మహేష్ భట్ చేతులారా కూతురు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టాడంటున్నారు. పస లేనప్పుడు కామ్‌గా ఉండక 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ దర్శకత్వం అంటూ సడక్ 2 ని నాశనం చేసాడంటున్నారు. మరి అలియా భట్ ఇప్పుడు సుశాంత్ అభిమానుల దెబ్బ, సడక్ 2 దెబ్బ తన తదుపరి ప్రాజెక్ట్స్ మీద ఎక్కడ పడుతుందో అనే మానసిక సంఘర్షణలో ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 

Alia Bhatt Sadak 2 Disaster at Box Office:

Alia Bhatt worry about Sadak 2 result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ