నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందని ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరికీ ఆసక్తిగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్టుగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో ప్రతీ ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో చాలా లెక్కలు మారనున్నాయి.
ఐతే ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు హీరోగా కనిపించనున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా సుధీర్ బాబు నటన అదిరిపోనుందని అంటున్నారు. వి తర్వాత సుధీర్ బాబు కెరోర్లో చాలా మార్పు రానుందని, యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడని వార్తలు వస్తున్నాయి. ఐతే వి తర్వాత సుధీర్ బాబు చేయబోతున్న సినిమాలేంటనేది చూస్తే, యాత్ర సినిమా నిర్మాతలతో సుధీర్ బాబు సినిమా ఒప్పుకున్నాడట.
70ఎమ్ ఎమ్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రం క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కనుందట. అనంతరం బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లైన్లో ఉందట. ఐతే ఈ చిత్రాల లెక్కలు వి చిత్రం రిలీజ్ తర్వాత మారిపోనున్నాయని వినబడుతోంది. చూడాలి మరి ఏం జరగనుందో..