కంగనా బాలీవుడ్ బడా హీరోలకు, దర్శకనిర్మాతలకు, స్టార్ కిడ్స్‌కి సోషల్ మీడియా వ్యాప్తంగా చుక్కలు చూపిస్తుంటే... కంగనాకి నెటిజెన్స్ చుక్కలు చూపిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో కంగనా ఒక్కసారిగా బాలీవుడ్ నెపోటిజం, స్టార్ కిడ్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడమే కాదు.. తాజాగా హ్రితిక్ రోషన్ పేరు ఎత్తకుండా అతను డ్రగ్స్‌కి బానిస అని, ఆయన భార్య ఆయన్ని వదిలేసి పోతే ఆయనతో తాను డేటింగ్ చేశా అని.. కానీ ఆయన కుటుంబ సభ్యులు తనని బెదిరించారంటూ సంచలనాత్మకంగా మాట్లాడింది. అలాగే బాలీవుడ్ ప్రముఖులంతా డ్రగ్స్ వాడతారని.. ఈ సుశాంత్ కేసుతో సిబిఐ డ్రగ్స్ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తే బడా బాబులు బయటికొస్తారంటూ మాట్లాడింది.
ఎప్పుడూ సుశాంత్ సింగ్ మరణం, నెపోటిజం, డ్రగ్స్ అంటూ మాట్లాడుతున్న కంగనాని నెటిజెన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. హృతిక్ రోషన్ పై కంగనా చేసిన కామెంట్స్ ఫలితమో.. మరి ఏమిటో తెలియదు కానీ... కంగనా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రోజుకి వేలల్లో హ్యాండ్ ఇస్తున్నారు. కంగనాకు అన్‌ఫాలో చేస్తూ ఆమెకు నెటిజన్లు షాక్ ఇచ్చారు. తాజాగా కంగనా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పడిపోతోంది. ప్రతి రోజు దాదాపు 50 వేల మంది పాలోవర్లను కోల్పోతున్నారని కంగనాకి ఓ నెటిజెన్ గుర్తు చెయ్యగా దానికి కంగనా స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పింది. అయితే కంగనా ట్విట్టర్ తనకు కొత్త అని అయితే నెటిజన్లు ఎందుకు అన్‌ఫాలో అవుతున్నారో తెలియట్లేదని తెలిపింది. మరి నెపోటిజం, డ్రగ్స్ విషయంలో బాలీవుడ్‌కి చుక్కలు చూపెడదామనుకుంటే... ఇప్పుడు కంగనాకి నెటిజెన్స్ చుక్కలు చూపిస్తూ.. షాకిస్తున్నారు.