Advertisementt

జబర్దస్త్.. ఆ కమెడియన్ తప్పుకుంటున్నాడా?

Wed 02nd Sep 2020 09:52 PM
jabardasth,comedian,shakalaka shankar,out,no rating  జబర్దస్త్.. ఆ కమెడియన్ తప్పుకుంటున్నాడా?
Rumors on Jabardasth Comedian Shakalaka Shankar జబర్దస్త్.. ఆ కమెడియన్ తప్పుకుంటున్నాడా?
Advertisement
Ads by CJ

జబర్దస్త్ ఈటీవీలో మొదలైనప్పుడు వేణు, ధనరాజ్, చంద్ర, షకలక శంకర్‌లే జబర్దస్త్ టీం లీడర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ లో బాగా క్రేజ్ ఫేమ్ రాగానే వెండితెర వైపుకి అడుగులువేస్తూ జబర్దస్త్‌ని వదిలేశారు. అయితే జబర్దస్త్‌ని వదిలేశాక మళ్లీ జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి వేణు - ధనరాజ్ లాంటి వాళ్ళు ట్రై చేసి చివరికి నాగబాబుతో అదిరింది షోలో స్కిట్స్ చేసుకుంటుంటే.. షకలక శంకర్ జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి స్కిట్స్ తో టాప్‌లో ఉండేవాడు. తర్వాత వెండితెర మీద కామెడితో పాటుగా హీరో అవతారమెత్తాడు. హీరోగా సక్సెస్ కాలేక.... మళ్లీ నాగబాబు అదిరిందికి వెళ్ళిపోయాక.. ఇప్పుడు జబర్దస్త్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు శంకర్.

 

అయితే గతంలో మాదిరిగా షకలక శంకర్ స్కిట్స్ జబర్దస్త్‌లో పేలడం లేదు. అందుకే ఆయన స్కిట్స్ ఎపిసోడ్ చివరిలో వేస్తున్నారు నిర్వాహకులు. జబర్దస్త్‌లో శంకర్ స్కిట్స్‌కి రేటింగ్ రావడం లేదని, యూట్యూబ్ లోను శంకర్ స్కిట్స్ కి క్రేజ్ తగ్గిందని.. అందుకే మల్లెమాల వాళ్ళు శంకర్ కి తక్కువ పారితోషకం ఇవ్వడంతో షకలక శంకర్‌కి బాధ కలిగి జబర్దస్త్‌ని వదిలేస్తున్నట్టుగా సోషల్ మీడియా టాక్. స్కిట్స్ లో ప్రాధాన్యత లేకపోవడమా? లేదంటే మళ్లీ హీరో పాత్రల మీద మోజు కలిగిందో కానీ.. షకలక శంకర్ ఇప్పుడు జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో మొదలయ్యింది. 

Rumors on Jabardasth Comedian Shakalaka Shankar:

Comedian Out from Jabardasth Comedy show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ