Advertisementt

ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా ఉంటుందా..?

Thu 03rd Sep 2020 08:21 PM
pawan kalyan,pspk,kishore kumar parthasani,dolly,telugu  ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా ఉంటుందా..?
Will Pawan do film with that director..? ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా ఉంటుందా..?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ లైనప్ లో నాలుగు సినిమాలున్నాయి. ఒకదాని తర్వాత మరోటి చకచకా రెడీ కాబోతున్నాయి. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష, హరీష్ శంకర్ తో మరో సినిమా, ఇంకా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా మరోటి. ఇలా వరుసగా సినిమాలని లైన్లో పెట్టి బిజీగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐతే ఈ లైనప్ లో కిషోర్ పార్థసానీ అలియాస్ డాలీ తో సినిమా లేదు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో దర్శకుడిగా మారిన కిషోర్ పార్థసానీ, ఆ తర్వాత తడాఖా తీసాడు. అనంతరం పవర్ స్టార్ తో గోపాల గోపాల తెరకెక్కించాడు. ఆ చిత్రం మంచి విజయమే అందుకుంది. ఆ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కాటమ రాయుడు అవకాశం వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఐతే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తో డాలీ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ చేయబోయే నాలుగవ సినిమా అదే అయ్యుంటుందని అన్నారు. కానీ అనూహ్యంగా ఆ స్థానంలోకి సురేందర్ రెడ్డి వచ్చారు. మరి కిషోర్ పార్థసానీతో సినిమా ఉంటుందా ఉండాదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఐతే పవన్ కళ్యాణ్ డాలీ తో సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడట. కాకపోతే స్క్రిప్టు నచ్చకే డాలీతో సినిమా ఓకే కాలేదట. ఒకవేళ డాలీ స్క్రిప్ట్ నచ్చితే ప్రస్తుతం చేస్తున్న నాలుగు సినిమాల తర్వాత తెరకెక్కే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరగనుందో..

Will Pawan do film with that director..?:

Will Pawan do film with that director..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ