Advertisementt

ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి.. షాక్ అయిన స్టూడెంట్స్..

Thu 03rd Sep 2020 10:07 PM
sai pallavi,love story,medicine,exam hall,naga chaitanya,shekat kammula  ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి.. షాక్ అయిన స్టూడెంట్స్..
Sai Pallavi in Exam Hall.. ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి.. షాక్ అయిన స్టూడెంట్స్..
Advertisement
Ads by CJ

ఫిదా భామ సాయి పల్లవి ఇటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ తన చదువుని కొనసాగించింది. మెడిసిన్ కంప్లీట్ చేసిన సాయి పల్లవి తన చదువు పట్ల ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ మెడిసిన్ ని మాత్రం పక్కన పెట్టలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో పంచుకుంది. తాజాగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

మెడిసిన్ చదువుకున్న సాయి పల్లవి ప్రత్యేక పరీక్ష నిమిత్తం తిరుచ్చిలోని ఎమ్ ఏ ఎమ్ కాలేజీలో కనిపించింది. ఎగ్జామ్ రాయడానికి వచ్చిన సాయి పల్లవి మాస్క్ ధరించింది. అయినప్పటికీ అక్కడి స్టాఫ్ సహా విద్యార్థులంతా గుర్తుపట్టారు. దాంతో సాయి పల్లవితో ఫోటోలు దిగడానికి స్టూడెంట్స్ ఎగబడ్డారు. ఎంతో ఓపికగా సాయి పల్లవి అందరితో ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా కనిపిస్తున్నాడు. రానాతో విరాట పర్వం లోనూ సాయి పల్లవి నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు కరోనా కారణంగా చిత్రీకరణ జరుపుకోవట్లేదు. వన్స్ కరోనా నియంత్రణలోకి వచ్చాక ఈ రెండు చిత్రాలు థియేటర్లలో రానున్నాయి.

Sai Pallavi in Exam Hall..:

Sai Pallavi in Exam Hall..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ