Advertisementt

లిస్ట్‌లోకి సురేందర్ రెడ్డి.. పవన్ లెక్కేంటి?

Fri 04th Sep 2020 10:29 PM
pawan kalyan,4th film,surender reddy,comeback  లిస్ట్‌లోకి సురేందర్ రెడ్డి.. పవన్ లెక్కేంటి?
Pawan Kalyan and Surender Reddy Combo Movie Announced లిస్ట్‌లోకి సురేందర్ రెడ్డి.. పవన్ లెక్కేంటి?
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక రెండేళ్ల గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెంటవెంటనే మూడు సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. వేణు శ్రీరామ్‌తో వకీల్ సాబ్ షూటింగ్ చివరిదశలో ఉండగా.. క్రిష్‌తో పిరియాడికల్ మూవీ, హరీష్ శంకర్‌తో కమర్షియల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే మూడు సినిమాల షూటింగ్స్ కరోనా వలన వాయిదా పడ్డాయి. ఈలోపు పవన్ కళ్యాణ్ పూరి జగన్నాధ్ తోనూ, త్రివిక్రమ్‌తోను సినిమాలు కమిట్ అవుతున్నాడనే టాక్ వినిపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోసియమ్ రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి.

మధ్యలో సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి‌తో పవన్ సినిమా.. అది గాసిప్ అనే అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పవన్‌కి ఇండస్ట్రీ నుండి పొలిటికల్ పార్టీస్ నుండి విషెస్ వెల్లువలా రావడమే కాదు.. పవన్ కళ్యాణ్ న్యూ మూవీ లుక్స్ కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్లో వచ్చాయి. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లుక్ విడుదల చేస్తే, క్రిష్ తో పవన్ చెయ్యబోయే పిరియాడికల్ మూవీ ప్రీ లుక్ వచ్చింది. అలాగే పవన్ - హరీష్ కాంబోలో తెరకెక్కబోయే PSPK28 మూవీ ప్రీ లుక్ పోస్టర్ అయితే కేకే. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ఉండబోతుంది అని ఆ పోస్టర్ చూడగానే అర్ధమైంది.

ఇక ఎవరూ ఊహించని విధంగా సురేందర్ రెడ్డితో పవన్ మూవీ ప్రకటన కూడా వచ్చేసింది. SRT మూవీస్ సురేందర్ రెడ్డి - పవన్ కాంబో మూవీని నిర్మించబోతున్నారు. మరి మూడు సినిమాలు ముగించేసి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారని అంటే.. కాదు పవన్ వరసగా సినిమాలకే మొగ్గు చూపుతున్నాడనేది పవన్ పుట్టిన రోజునాడు ఫిక్స్ అయ్యింది. ఇక పవన్ త్రివిక్రమ్, పవన్ పూరి కాంబో సెట్ కాలేదు కానీ... ఎవరూ అనుకోని విధంగా లిస్ట్‌లోకి సురేందర్ రెడ్డి వచ్చాడు. మరి పవన్ లెక్క మారినట్లుగానే కనబడుతుంది.

Pawan Kalyan and Surender Reddy Combo Movie Announced:

Pawan committed his 4th film with surender reddy after comeback

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ