Advertisementt

చిరంజీవితో మెహెర్ రమేష్ చిత్రం.. పవన్ చెప్పేసాడు..

Thu 03rd Sep 2020 10:29 PM
meher ramesh,pawan kalyan,chiranjeevi,acharya,koratalashiva  చిరంజీవితో మెహెర్ రమేష్ చిత్రం.. పవన్ చెప్పేసాడు..
Chiru- Meher combo film confirmed by PK.. చిరంజీవితో మెహెర్ రమేష్ చిత్రం.. పవన్ చెప్పేసాడు..
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చాలా బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ రీ స్టార్ట్ కాబోతుంది. ఐతే ఈ సినిమా తర్వాత చిరంజీవి, ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే విషయమై చాలా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అలా వినిపించిన పేర్లలో మెహెర్ రమేష్ కూడా ఉన్నారు.

షాడో ఫ్లాప్ తర్వాత మెహెర్ రమేష్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అలాంటి దర్శకుడికి మెగాస్టార్ అవకాశం ఇస్తాడా అని చాలామంది సందేహించారు. ప్రస్తుతం ఆ సందేహాలకి సమాధానం దొరికినట్టయింది. మెగాస్టార్ తో మెహెర్ రమేష్ సినిమా ఉంటుందని కన్ఫర్మ్ అయింది. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మెహెర్ రమేష్  శుభాకాంక్షలు తెలియజేసాడు.

ఐతే విషెస్ తెలిపిన అందరికీ రిప్లై మెసేజ్ లు ఇస్తున్న పవన్ కళ్యాణ్, మెహెర్ రమేష్ కి థ్యాంక్యూ అని చెప్తూ భవిష్యత్తులో చిరంజీవి గారితో చేయబోయే సినిమాకి ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు షాక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేసిన ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

click here for Tweet

Chiru- Meher combo film confirmed by PK..:

Chiru- Meher combo film confirmed by PK..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ