Advertisementt

కష్టపెట్టి ఉంటే క్షమించండి: సమంత

Fri 04th Sep 2020 10:39 PM
samantha,netizens,chit chat,ask samantha,dream roles  కష్టపెట్టి ఉంటే క్షమించండి: సమంత
Samantha Chit Chat with Netizens in Social Media కష్టపెట్టి ఉంటే క్షమించండి: సమంత
Advertisement
Ads by CJ

ఈ ఏడాది తెలుగు, తమిళ్‌లో ఎలాంటి సినిమాలు ఒప్పుకొని సమంత ఎక్కువగా ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరీస్ గురించే మాట్లాడుతుంది. బాలీవుడ్ లో ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరీస్ ఇటు తెలుగు అటు తమిళంలోను డబ్ అయ్యి తెగ పాపులర్ అయ్యింది. అయితే ఫ్యామిలీమ్యాన్ 2 లో సమంత ఓ నెగెటివ్ రోల్ చేసింది అనే టాక్ ఉంది. సమంత తాజాగా ఫ్యామిలీమ్యాన్ డబ్బింగ్ కూడా చెప్పినట్టుగా రివీల్ చేసింది. అయితే తాజాగా అభిమానులల్తో మాట్లాడిన సమంత మరోసారి ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరీస్ గురించి మాట్లాడింది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరీస్ రషెస్ చూసాక తనకి ఆనందం పట్టలేక కన్నీళ్లు వచ్చేశాయని, ఆ వెబ్ సీరీస్ లో నటించడం తనకి ఎంతో నచ్చింది అని చెబుతుంది. ఇక మీకు ఇష్టమైన పాత్రలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే.. నాకు ఇష్టమైన పాత్ర అంటూ ఏమి ఉండదు అంటుంది.

గతంలో చేసిన పాత్రలకు బిన్నంగా చేయాలనేదే నా కోరిక. ఓటముల ప్రభావాన్ని పనిమీద, నా చుట్టూ ఉన్నవారిపై పడకుండా చూసుకుంటాను. అలాగే ఓ అభిమాని సమంతని ఉద్దేశించి.. నేను ఐదారేళ్లుగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను.. కానీ మీరు సమాధానం ఇవ్వడం లేదు అనగానే.. లేదు లేదు.. మీ లాంటి అభిమానుల వలనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నేను సమాధానం చెప్పకుండా ఎవరినైనా కష్టపెట్టి ఉంటే క్షమించండి. అలాగే తాను ప్రారంభించిన ఏకం స్కూల్ ముచ్చట్లను అభిమానులల్తో పంచుకుంది సమంత. చదువు అంటే కేవలం అకాడమిక్ మాత్రమే కాదు.. ఇది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది కూడా. పిల్లలకు విలువలతో కూడిన చదువు ఇవ్వాలనే ఇందులో భాగమయ్యాను అని చెబుతుంది సమంత.

Samantha Chit Chat with Netizens in Social Media:

I Have no dream roles says Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ