Advertisementt

ఆ బాలీవుడ్ చిత్రం టాక్సీవాలా రీమేక్ కాదుగా...?

Sun 06th Sep 2020 09:41 PM
vijay devarakonda,taxiwala,khali peeli,ishan khatter,ananya pandey,makbhum khan,nbollywood,  ఆ బాలీవుడ్ చిత్రం టాక్సీవాలా రీమేక్ కాదుగా...?
Is Taxiwala remade into Bollywood..? ఆ బాలీవుడ్ చిత్రం టాక్సీవాలా రీమేక్ కాదుగా...?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంక్రిత్యాయాన్ దర్శకత్వం వహించిన  సినిమా టాక్సీవాలా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఐతే ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయ్యిందన్న వార్తలు జోరందుకున్నాయి. ఇషాన్ ఖత్తర్, అనన్య పాండే జంటగా నటిస్తున్న ఖాళీ పీలీ చిత్రం టాక్సీవాలా రీమేక్ గానే రూపొందిందని ప్రచారం జరిగింది.

ఖాళీ పీలీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఈ రూమర్లు బాగా ఊపందుకున్నాయి. ఖాళీ పీలీ టీజర్ లో కనిపించిన దాని ప్రకారం టాక్సీవాలాకి ఆ సినిమాకి ఎలాంటి సంబంధం లేదనిపించింది. కాకపోతే ఖాళీ పీలో కథ కూడా పూర్తిగా టాక్సీలోనే జరగబోతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఆ దెబ్బతో టాక్సీవాలా రీమేక్ అనే మాటలు వచ్చాయి. ఐతే తాజాగా చిత్ర దర్శకుడు మక్భూల్ ఖాన్ మాట్లాడుతూ ఖాళీ పీలీ చిత్రం ఏ చిత్రానికి రీమేక్ కాదని, తానే స్వయంగా రాసాడని చెప్పుకొచ్చాడు. ఇకనైనా టాక్సీవావా రీమేక్ అన్న మాటలు తగ్గుతాయేమో చూడాలి.

Is Taxiwala remade into Bollywood..?:

Is Taxiwala remade into Bollywood..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ