Advertisementt

రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం యాక్షన్ డైరెక్టర్..

Tue 08th Sep 2020 11:04 AM
srivas,suresh babu,dancing queen,modnight runners,sudheer varma  రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం యాక్షన్ డైరెక్టర్..
Action movies director ready to do Romcom..? రొమాంటిక్ ఎంటర్ టైనర్ కోసం యాక్షన్ డైరెక్టర్..
Advertisement
Ads by CJ

మిస్ గ్రానీ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులోకి ఓ బేబీ గా రీమేక్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సురేష్ బాబు, మరో రెండు కొరియన్ చిత్రాల రీమేక్ హక్కులని కొని పెట్టుకున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో మిడ్ నైట్ రన్నర్స్ ఒకటి కాగా డాన్సింగ్ క్వీన్ అనే చిత్రం మరోటి. ఈ రెండు చిత్రాలని తెలుగులోకి తీసుకొచ్చేందుకు సురేష్ బాబు పనులు మొదలెట్టాడని టాక్. ఐతే మిడ్ నైట్ రన్నర్స్  చిత్ర రీమేక్ బాధ్యతలని సుధీర్ వర్మ తీసుకున్నాడని సమాచారం.

ఈ రీమేక్ లో రెజీనా కెసాండ్రా, నివేథా థామస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక డాన్సింగ్ క్వీన్ చిత్రాన్ని శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్నాడని వినిపిస్తుంది. లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం చిత్రాల దర్శకుడు ఈ డాన్సింగ్ క్వీన్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఐతే ఇప్పటి వరకూ శ్రీవాస్ చేసిన సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే.

ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా యాక్షన్ సినిమాలని తెరకెక్కించిన శ్రీవాస్ డాన్సింగ్ క్వీన్ అనే రొమాంటిక్ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది ఆసక్తిగా ఉంది. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ శ్రీవాస్ డాన్సింగ్ క్వీన్ తెలుగు రీమేక్ కి దర్శకుడిగా కన్ఫర్మ్ అయిపోనట్టే అని వినబడుతోంది. 

Action movies director ready to do Romcom..?:

Action movies director ready to do Romcom..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ