ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రెండు రోజుల క్రితమే మొదలైంది. మొదటి రోజు కంటెస్టెంట్ల పరిచయం జరగ్గా రెండవ రోజు కొంత రసాభాస జరిగి ప్రేక్షకుల దృష్టికి వచ్చారు. ఐతే మొత్తం పదహారు మంది కంటెస్టెంట్లని ఎంచకున్న బిగ్ బాస్ యాజమాన్యం పద్నాలుగు మందిని మాత్రమే హౌస్ లోకి పంపింది. మిగతా ఇద్దరు కంటెస్టెంట్లని సీక్రెట్ రూంలో పెట్టింది.
వాళ్ళు ఇంట్లో వాళ్లతో ఎప్పుడు కలుస్తున్నారనేది ఇంకా తెలియదు. కరోనా కారణంగా ఈ సారి బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఉండదని అనుకున్నారు. బయటవారిని తీసుకొస్తే రిస్క్ ఉందన్న కారణంగా వైల్డ్ కార్ట్ ఎంట్రీ పెట్టట్లేదని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది.
జబర్దస్త్ కమెడియన్ అవినాష్ వైల్డ్ కార్ట్ ఎంట్రీగా రాబోతున్నాడని సమాచారం. మరి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడుంటుంది అనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. సాధారణంగా రెండు మూడు వారాలు పూర్తయితే గానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఉండదు. కానీ బిగ్ బాస్ తనకు నచ్చిన విధంగా ప్లాన్ చేస్తాడు కాబట్టి ఎప్పుడయినా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్ వస్తాడా లేదా చూడాలి.