Advertisementt

పూజాకి ఆ హీరోతో చేయడానికి ఏం ప్రాబ్లమ్?

Wed 09th Sep 2020 08:11 PM
pooja hegde,raviteja,heroine,raviteja movie  పూజాకి ఆ హీరోతో చేయడానికి ఏం ప్రాబ్లమ్?
Heroine Pooja Hegde Busy with Movies పూజాకి ఆ హీరోతో చేయడానికి ఏం ప్రాబ్లమ్?
Advertisement
Ads by CJ

పూజాహెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్‌తో రాధేశ్యాంతో పూజాహెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ లిస్ట్ లోకెళ్లింది. ఇప్పటివరకు తెలుగు, బాలీవుడ్ మూవీస్‌తో బిజీగా ఉన్న పూజాహెగ్డే తాజాగా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే టాక్ ఉంది. అయితే పూజాహెగ్డేకి పాత్ర నచ్చితే చిన్న హీరో అని చూడకుండా సినిమా చేసేస్తుంది. ముకుందాతో వరుణ్ తేజ్‌తో నటించిన పూజాహెగ్డే తర్వాత హరీష్ శంకర్ అడిగాడని గద్దలకొండ గణేష్ లో మళ్ళీ వరుణ్ తేజ్ పక్కన గెస్ట్ రోల్ లో నటించింది. ఆ శ్రీదేవి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందుకే పాత్ర నచ్చితే హీరో ఎవరని కూడా పూజాహెగ్డే చూడదంటారు.

అయితే తాజాగా ప్లాప్ హీరో రవితేజ హిట్ దర్శకుడు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కనున్న ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకి జోడిగా పూజాహెగ్డేని సంప్రదిస్తున్నారని అంటున్నారు. రవితేజ చెయ్యబోయే రెండు పాత్రల్లో ఓ పాత్రకి హీరోయిన్‌గా పూజాహెగ్డేని తీసుకుంటే.. మంచి క్రేజ్ వస్తుంది అని.. సెకండ్ పాత్రకి కాస్త ఫేమ్ ఉన్న హీరోయిన్ అయితే సరిపోతుంది అని దర్శకుడు రమేష్ వర్మ భావిస్తున్నాడట. అయితే పూజాహెగ్డేకి ఇప్పుడు ప్లాప్ హీరో రవితేజ అని నో చెబుతుంది అని కాదు కానీ.... ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో టాలీవుడ్‌లో రెండు సినిమాలు, అలాగే బాలీవుడ్ మూవీస్‌కి కమిట్ అవడంతో.. అసలే కరోనాతో అన్ని మూవీస్ ఒకేసారి సెట్స్ మీదకెళ్లడంతో పూజాహెగ్డేకి రవితేజ సినిమా చేసే అవకాశం ఉంటుందో లేదో అంటున్నారు.

Heroine Pooja Hegde Busy with Movies:

Pooja Hegde says no to Raviteja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ