Advertisementt

పాన్‌ఇండియా ఆఫర్‌తో నారా రోహిత్ కన్ఫ్యూజన్!

Wed 09th Sep 2020 10:24 PM
nara rohith,dilemma,pan india film,offer,sukumar,allu arjun  పాన్‌ఇండియా ఆఫర్‌తో నారా రోహిత్ కన్ఫ్యూజన్!
Nara Rohith in Confusion with Pushpa Offer పాన్‌ఇండియా ఆఫర్‌తో నారా రోహిత్ కన్ఫ్యూజన్!
Advertisement
Ads by CJ

సుకుమార్ పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి తప్పుకున్న పాత్రకి ఏ హీరో అయితే బావుంటుంది అనే మీమాంశలో ఉన్నప్ప్పుడు.. నారా రోహిత్ అయితే ఈ పాత్రకి బాగా సెట్ అవుతాడని బన్నీ ఇచ్చిన సలహాతో సుకుమార్ అండ్ టీం నారా రోహిత్‌ని పుష్ప సినిమాలోనూ కీలక పాత్రకి అప్రోచ్ అయ్యారట. అయితే నారా రోహిత్.. మంచి పాన్ ఇండియా ఆఫర్ తగిలింది.. కానీ ప్రస్తుతం బరువు తగ్గి ఓ మంచి కథతో హీరోగా రీ ఎంట్రీ ఇద్దామనుకుని జిమ్ వగైరా చేసి ఫిట్‌గా తయారయ్యాను.. ఇలాంటి సమయంలో పుష్ప పాత్ర ఒప్పుకోవాలా? లేదంటే హీరోగానే మంచి కథతో సినిమా చెయ్యాలా? అనే కన్ఫ్యూజన్‌లో నారా రోహిత్ ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత ఉన్న నారా రోహిత్ బరువు కారణంగా హీరో పాత్రలకు సెట్ కాకుండా పోవడంతో.. రోహిత్ జిమ్ మీద బరువు మీద దృష్టి పెట్టి బరువు తగ్గాడు. అయితే ఇప్పుడు హీరోగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌ని చూపించాలనుకుంటున్న టైంలో పాన్ ఇండియా ఆఫర్ రావడం అందులోను సుకుమార్ దర్శకత్వంలో కీ రోల్ చేసే ఆఫర్ రావడం మామూలు విషయం కాదు. సుకుమార్ సినిమాలో విలన్ షేడ్స్ కానీ, కేరెక్టర్ ఆర్టిస్ట్‌‌ల పాత్రలు కానీ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది ఈ పాత్ర వదులుకోవాలా? ఓకే చెప్పాలా? అనే డైలమాలో నారా రోహిత్ పడ్డాడట. ఒకవేళ పుష్ప సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. హీరోగా క్రేజ్ తగ్గుతుందేమో అనే భయం కూడా నారా రోహిత్‌కి కలుగుతుందట. సో పుష్ప ఆఫర్ రోహిత్‌ని డైలమాలో పడేసిందన్నమాట.

Nara Rohith in Confusion with Pushpa Offer :

Nara Rohith in dilemma with Pan India film Offer 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ