Advertisementt

ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందే..!

Wed 09th Sep 2020 03:08 PM
bomma blockbuster,nandu,rashmi,telugu  ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందే..!
Would it become a block buster..? ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందే..!
Advertisement
Ads by CJ

యాక్టర్ నందు హీరోగా చాలా సినిమాలు చేసాడు. కానీ ఏ సినిమాతోనూ సరైన గుర్తింపు రాలేదు. చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉన్నా సరైన హిట్ అందుకోలేకపోయాడు. మొన్నటికి మొన్న వచ్చిన సవారి చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఐతే తాజాగా నందు నుండి మరో కొత్త సినిమా రాబోతుంది. బీబీ అంటూ మీడియాతో పాటు అందరినీ కన్ఫ్యూజ్ చేసిన నందు తన కొత్త సినిమాకి బ్లాక్ బస్టర్ అనే టైటిల్ తో వచ్చాడు. 

బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ క్యాచీగా ఉండడమే కాదు, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి చిత్ర యూనిట్ చాలా క్రియేటివ్ గా పని చేస్తున్నట్టు అర్థం అవుతుంది. సినిమా నుండి రిలీజ్ చేసిన హీరో, హీరోయిన్ల లుక్స్ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మొదటగా హీరో నందు లుక్ బయటకి వచ్చింది. పోతురాజు అనే పాత్రలో పౌరాణికం గెటప్ లో నోట్లో సిగరెట్ వెలుగుతూ కనిపించాడు. అంతే కాదు పోతురాజు పాత్ర పూరీ జగన్నాథ్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు కూడా.

ఈ పోస్టర్ అందరి బాగా ఆకర్షించింది. ఐతే తాజాగా పోతురాజు గాడి లవర్ వాణిని పరిచయం చేసారు. వాణి పాత్రలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కనిపించింది. రష్మి లుక్ చాలా కొత్తగా ఉంది. గతంలో ఆమె చేసిన పాత్రలకి భిన్నంగా ఉండి ఆసక్తి పెంచుతుంది. పోస్టర్ల ద్వారా అటెన్షన్ కి లాక్కుంటున్న బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని అనుకుంటున్నారు. మరి వారి నమ్మకాన్ని నిలబెడుతుందా లేదా చూడాలి.

Would it become a block buster..?:

Would it become a block buster..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ