హీరోయిన్స్ అన్నాక లవ్ - బ్రేకప్ అనేది సర్వసాధారణమైపోయింది. ఎక్కడో నాగ చైతన్య - సమంత, రణ్వీర్ సింగ్ - దీపికాపదుకొనే లాంటి ప్రేమ పక్షుల ప్రేమ మాత్రం పెళ్లి వరకు వెళుతుంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో వరస ఛాన్స్‌లు కొట్టేస్తూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్న రష్మిక కూడా కన్నడలో చేసిన ఒకే ఒక్క సినిమాతో ఆ సినిమాలో నటించిన హీరో రక్షిత్‌తో ప్రేమలో పడడం, నిశ్చితార్ధం కూడా చేసుకోవడంతో రష్మిక పెళ్లి కూడా చేసుకుంటుంది అనుకుంటే ప్రేమను, నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేసుకుంది. తర్వాత సినిమాలతో బిజీ అయ్యింది. అయితే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో రెండు మూడు సినిమాలు చేసేసరికి రష్మికకి విజయ్ దేవరకొండకి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది.
తాజాగా మీరు ఓ యంగ్ హీరోతో లవ్‌లో ఉన్నారటగా అని అడగ్గానే రష్మిక కస్సున లేచింది. నేను ఎవరితోనూ రిలేషన్ మెయింటైన్ చెయ్యడం లేదు. ఎవరితోనూ లవ్‌లో లేను. ప్రస్తుతానికి సింగిల్. సింగిల్‌గా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. నాకు తెలిసిన ప్రతి అబ్బాయితో.. నాపేరు పక్కన చేర్చి తప్పుడు రాతలు రాయడం ఏం బాగోలేదు. నాకు ఒంటరిగా ఉండడమే నాకు నచ్చింది. సింగిల్‌గా ఉన్నామని బాధపడేవారికి నా సలహా.. లైఫ్ లో ఒంటరిగా ఆనందంగా ఉండడం తెలుసుంటే.. మనకు కాబోయే భాగస్వామిపై కూడా అంచనాలు పెరుగుతాయి... అంటూ లెక్చర్ ఇస్తుంది రష్మిక.