Advertisementt

మెగాస్టార్ సినిమాలో సాయి పల్లవి..?

Thu 10th Sep 2020 10:39 AM
megastar chiranjeevi,sai pallavi,meher ramesh,pawan kalyan  మెగాస్టార్ సినిమాలో సాయి పల్లవి..?
Sai Pallavi in Megastars film..? మెగాస్టార్ సినిమాలో సాయి పల్లవి..?
Advertisement
Ads by CJ

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసిన సాయి పల్లవి, వరుస అవకాశాలని అందిపుచ్చుకుంటుంది. నటనా ప్రాధాన్యమున్న విభిన్న పాత్రలలో కనిపించడానికే ఇష్టపడుతున్న సాయి పల్లవి తన కెరీర్ ని చాలా చక్కగా నిర్మించుకుంటుంది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మూడు తెలుగు సినిమాలున్నాయి. వాటిల్లో రెండు చిత్రాలు విరాట పర్వం, లవ్ స్టోరీ రిలీజ్ కి రెడీ అవుతుండగా, నాని శ్యామ్ సింగరాయ్ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.

ఐతే తాజాగా సాయి పల్లవికి మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న వేదాళం తెలుగు రీమేక్ లో సాయిపల్లవి, చిరంజీవి కూతురుగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ సాయి పల్లవి ని సంప్రదించారని టాక్.

ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆచార్య షూటింగ్ ముగిసిన అనంతరం పట్టాలెక్కనుంది. ఐతే ఈ సినిమా విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రానప్పటికీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని విషెస్ తెలియజేసిన మెహెర్ రమేష్ కి దన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్, ఈ సినిమా గురించి ప్రస్తావించడంతో అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Sai Pallavi in Megastars film..?:

Sai Pallavi in Megastars film..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ