Advertisementt

చిరు కొత్త లుక్ ఆ సినిమా కోసమేనా..?

Thu 10th Sep 2020 10:54 PM
megastar chiranjeevi,acharya,meher ramesh,vedalam remake,ajith  చిరు కొత్త లుక్ ఆ సినిమా కోసమేనా..?
Chiranjeevi new look for Vedalam remake..? చిరు కొత్త లుక్ ఆ సినిమా కోసమేనా..?
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే చిత్రం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. మళయాల చిత్రమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లుగా వినిపించింది. ఇందుకోసం డైరెక్టర్ సుజిత్ కి రీమేక్ బాధ్యతలని అప్పగించారు కూడా. ఐతే సడెన్ గా ఈ రీమేక్ నుండి సుజిత్ ని తప్పించారని అన్నారు. దాంతో మెగాస్టార్ నెక్స్ట్ చిత్రంపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి.

ఈ సారి మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ చిత్రమైన వేదాలం తెలుగు రీమేక్ ని తెరమీదకి తీసుకొస్తున్నాడని ప్రచారం జరిగింది. ఈ విషయమై పవన్ కళ్యాణ్ నుండి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఐతే తాజాగా బయటకి వచ్చిన మెగాస్టార్ లుక్, వేదాలం రీమేక్ కోసమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. వేదాలం సినిమాలో అజిత్ లాగా తల మీద చిన్న వెంట్రుక కూడా లేకుండా గుండుతో కనిపించిన తీరు, వేదాలం సినిమా కోసమే అని అభిప్రాయపడుతున్నారు. 

ఐతే ఆచార్య షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఈ టైమ్ లో చిరంజీవి లుక్ మార్చాడంటే అది ఆచార్య సినిమా కోసమే అయ్యుంటుందని కొందరంటున్నారు.  మరి చిరంజీవి ఛేంజ్ చేసిన లుక్ ఏ సినిమా కోసమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. 

Chiranjeevi new look for Vedalam remake..?:

Chiranjeevi new look for Vedalam remake..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ